శీతాకాలం ప్రారంభం కావడంతో బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూసుకున్నాయి. ఉత్తరరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలను దేవస్థానం బోర్డు మూసివేసింది. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు ద్వారాలను మూసివేసినట్లు తెలిపింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. దర్శనంకు ఎవరిని అనుమతించరు.
ఈ ఉదయం 7 గంటలకు ఛార్‌దమ్ దేవస్థానం బోర్డు ముఖ్య కార్యనిర్వాహక అధికారి బీడీ సింగ్, బద్రీనాథ్ దామం ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఈశ్వరి ప్రసాద్ నంబూరితోపాటు తీర్థ పురోహితులు, వందలాది భక్తులు తలుపుల మూసివేత వేడుకల్లో పాల్గొన్నారు.
Uttarakhand: The portals of Badrinath Temple close for the winter season
Kedarnath Temple and Gangotri Temple already closed for the season. pic.twitter.com/sGc1jmVrIo
— ANI (@ANI) November 19, 2020
మధ్య మహేశ్వర్ మందిర్ ఆలయ తలుపులను ఇవాళ ఉదయం 7 గంటలకు మూసివేశారు. కేథరీనాథ్ ఆలయం, గంగోత్రి ఆలయాలను ఇప్పటికే మూసివేశారు. జ్యోతిష్య కాలమానం ప్రకారం అక్టోబర్ 25న బద్రీనాథ్ ఆలయ ద్వారాలను మూసివేయాలని దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించి అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.