‘బుట్టబొమ్మ షూట్ వీడియో’ లీక్.. ఎవరికీ చెప్పొద్దంటోన్నపూజా!
ఎవరికీ చెప్పొద్దంటూ అల వైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ షూటింగ్ వీడియో సాంగ్‌ను లీక్ చేసింది పూజా హెగ్డే. ఇప్పటికే రిలీజ్ అయిన ‘అల వైకుంఠపురం’లోని సాంగ్స్, మూవీ క్లిప్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. 2020 జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. పూజా హీరోయిన్‌గా నటించింది. అలాగే అలనాటి తార టబూ మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా.. ఈ సంక్రాంతికి హీరోల […]

ఎవరికీ చెప్పొద్దంటూ అల వైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ షూటింగ్ వీడియో సాంగ్‌ను లీక్ చేసింది పూజా హెగ్డే. ఇప్పటికే రిలీజ్ అయిన ‘అల వైకుంఠపురం’లోని సాంగ్స్, మూవీ క్లిప్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. 2020 జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. పూజా హీరోయిన్‌గా నటించింది. అలాగే అలనాటి తార టబూ మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా.. ఈ సంక్రాంతికి హీరోల మధ్య హోరాహోరీ పోటీ నెలకొండనుంది.
శనివారంతో ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. బుట్టబొమ్మ పాటను చివరగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది పూజా. బన్నీ డిజైనర్ చొక్కా ధరించగా, పూజా పింక్ ఫ్రాక్ వేసుకని పాటకు తగ్గట్టుగా వేస్తున్న స్టెప్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ఇందులో వీరిద్దరూ ఎంతో క్యూట్‌గా కనిపించారు.
Here’s a special sneak peak of #buttabomma for you’ll…shhhh…don’t tell anyone ??? #alavaikunthapurramuloo #topsecret @alluarjun #Trivikram @MusicThaman @ArmaanMalik22 @haarikahassine @GeethaArts #PSVinod pic.twitter.com/9y9qpXYluQ
— Pooja Hegde (@hegdepooja) December 29, 2019