తమిళనాట అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నవేళ జనం పంటపడుతోంది. అయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్ర ప్రజలకు పొంగల్ గిఫ్ట్ ప్రకటించారు. బియ్యం, చక్కెర, పొడి ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు, చెరకుతో కూడిన నిత్యావసరాల కూడిన బట్టల సంచిలో రూ.2,500 నగదు కూడా ఉంటుందని సీఎం వెల్లడించారు. రేషన్ బియ్యం పొందే 2 కోట్ల 6 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఈ పొంగల్ గిఫ్ట్ అందిస్తామని ఆయన తెలిపారు. సేలం జిల్లాలోని తన సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో అన్ని మౌలిక సదుపాయాలను మెరుగుపర్చినట్లు సీఎం తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సంక్రాంతి కానుకను ప్రకటించారు సీఎం పళనిస్వామి.