ఖైదీని వెంటబెట్టుకుని పోలీసుల షాపింగ్..చివరకి ఏం జరిగిందంటే

|

Mar 19, 2023 | 10:50 AM

దొంగలను, క్రిమినల్స్ ను అరెస్టు చేసి జైలుకు తరలించడం పోలీసుల విధి. జైల్లో ఉండగా ఖైదీలకు అనారోగ్య సమస్య వస్తే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడం మళ్లీ క్షేమంగా జైలకు తీసుకువచ్చే బాధ్యత పోలీసులకు ఉంటుంది

ఖైదీని వెంటబెట్టుకుని పోలీసుల షాపింగ్..చివరకి ఏం జరిగిందంటే
Shopping Mall
Follow us on

దొంగలను, క్రిమినల్స్ ను అరెస్టు చేసి జైలుకు తరలించడం పోలీసుల విధి. జైల్లో ఉండగా ఖైదీలకు అనారోగ్య సమస్య వస్తే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడం మళ్లీ క్షేమంగా జైలకు తీసుకువచ్చే బాధ్యత పోలీసులకు ఉంటుంది. అయితే ఓ రాష్ట్రంలో పోలీసులు చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో పోలీసులకు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లోని రిషబ్ రాయ్ అనే వ్యక్తి గత ఏడాది జూన్ లో అక్రమ ఆయుధాలు రవాణా చేయడంతో పోలీసులకు దొరికాడు. దీంతో అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ఇటీవల అతనికి జైల్లో ఉండగానే అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇక చేసేదేం లేక పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోర్టును కోరారు.

దీనిపై స్పందించిన కోర్టు ఆ ఖైదీని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో మార్చి 7 న పోలీసులు ఆ ఖైదీని జైలు నుంచి దవాఖాను తీసుకెళ్లారు. అక్కడ అతనికి చికిత్స వైద్యులు చికిత్స చేసి మందులు రాసిచ్చారు. అయితే అక్కడి నుంచి ఖైదీని జైలుకు తీసుకెళ్లేందుకు పోలీసులు వారి వాహనంలో బయలుదేరారు. కాని మధ్యలోనే ఓ షాపింగ్ మాల్ కనిపించడంతో అక్కడ ఆపారు. ఆ ఖైదీని కూడా పోలీసులు తమ వెంట తీసుకెళ్లి షాపింగ్ చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. పోలీసుల తీరుపై నెటీజన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో ఎస్సై రామ్ సేవక్ సహా ముగ్గరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి