రాష్ట్రపతికి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు సంధర్బంగా ప్రముఖుల శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

రాష్ట్రపతికి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

Updated on: Oct 01, 2020 | 8:52 AM

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు సంధర్బంగా ప్రముఖుల శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ‘రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తెలివితేటలు, విధానాలను ఆర్థం చేసుకునేతీరు అమోఘం. అవి దేశానికి గొప్ప ఆస్తులు. సేవ చేయడంలో ఆయన ముందుంటారు. ఆయన ఆరోగ్యంగా జీవించాలని’ ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా రాష్ట్రపతి కోవింద్‌కు పుట్టినరోజు విషెస్ తెలిపారు.

అటు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. రాంనాధ్ కోవింద్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఇటు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన శుభకాంక్షలు తెలియజేశారు. దేశానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. దేశానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాల తో భారత దేశ సేవలో కొనసాగాలని ఆశిస్తున్నాను. మీ మార్గ నిర్దేశం లో భారత దేశం మరింత అభివృద్ది చెందాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు తమిళసై సౌందరరాజన్.

Loading...
Unable to load recommendations.
Follow Us