వాజ్‌పేయికి మోదీ ఘన నివాళి.. ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటూ..

నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్థంతి సందర్భంగా.. ఆయనకు బీజేపీ నేతలు, ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సహా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాజ్‌పేయి స్మారకం సదైవ అటల్ వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత కౌల్ భట్టాచార్య, మనవరాలు నిహారికలను […]

వాజ్‌పేయికి మోదీ ఘన నివాళి.. ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటూ..

Updated on: Aug 16, 2019 | 8:29 AM

నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్థంతి సందర్భంగా.. ఆయనకు బీజేపీ నేతలు, ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సహా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాజ్‌పేయి స్మారకం సదైవ అటల్ వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత కౌల్ భట్టాచార్య, మనవరాలు నిహారికలను కలుసుకుని వారి మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. 1924 డిసెంబర్ 25న మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి.. మూడు సార్లు దేశ ప్రధానిగా సేవలందించారు. ఆయన సేవలకు గాను 2015లో భారత ప్రభుత్వం వాజ్‌పేయికి అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న పురస్కారం అందించింది. నాలుగు దశాబ్ధాల పాటు ఎంపీగా పదిసార్లు పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. రెండు సార్లు రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు. దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా గతేడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us