
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎమ్మెల్సీగా పెనుమత్స సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనమండలి ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీకి వైఎస్సార్సీపీ తమ పార్టీ తరఫున మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరావు తనయుడు సూర్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్సీకి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సూర్యానారయణను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూర్యానారాయణ ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.