అయోధ్య రాముడి గుడికి భూమి పూజను ప్రపంచ వ్యాప్తంగా కోట్లామంది వీక్షించారు. ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే పాకిస్తాన్ మాత్రం భిన్నంగా స్పందించింది. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మాత్రం చాలా ఆసక్తికరంగా స్పందించారు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో డిస్‌ప్లే చేసిన రామమందిరం ఫోటోను షేర్ చేసి దానికి ‘జై శ్రీరామ్’ అని జోడించారు.
శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని, శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న అయోధ్యలో రామ మందిర భూమి పూజ జరగడంతో ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆనందంగా ఉన్నారని కనేరియా తెలిపారు.
The beauty of Lord Rama lies in his character, not in his name. He is a symbol of the victory of right over the evil. There is wave of happiness across the world today. It is a moment of great satisfaction. #JaiShriRam pic.twitter.com/wUahN0SjOk
— Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020