
వీడియో షేరింగ్ అప్లికేషన్లో అనైతిక, అసభ్యకరమైన కంటెంట్‌పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్.. చైనా యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసింది. చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ నియంత్రణ కోసం సమర్థవంతమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంలో టిక్ టాక్ విఫలమైందని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) పేర్కొంది. సమాజంలోని వివిధ వర్గాల నుంచి అనేక ఫిర్యాదులను స్వీకరించిన తరువాత ఈ చర్య తీసుకున్నట్లు పీటీఏ తెలిపింది. ఐతే ఈ యాప్ లో ప్రజలు ఇచ్చే సమాచారానికి భద్రత లేని కారణంగా ఇండియా టిక్ టాక్ యాప్‌ని ఇటీవలే నిషేధించింది. అమెరికా కూడా ఈ అప్లికేషన్‌ను బ్యాన్ చేసేందుకు రెడీగా ఉంది.