ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది ఓ సామెత! కానీ మన రైతులకు మాత్రం ఉల్లి ఎప్పుడూ కీడే చేస్తోంది.. కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది.. హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున ఉల్లి దిగుమతి అవుతున్నది.. అదే సమయంలో రాయలసీమ, మహబూబ్‌నగర్‌ల నుంచి కూడా ఉల్లి మార్కెట్‌కు చేరుతున్నది.. అయితే తెలుగు రాష్ట్రాల ఉల్లికి ఎక్కువ ధర పలకడం లేదు.. క్వింటాల్ ధర మూడు వందల నుంచి 11 వందల వరకు ఉంది.. అదే మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిన పాత ఉల్లిని మాత్రం క్వింటాల్ వెయ్యి రూపాయిల నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఎందుకయ్యా ఈ వివక్ష అని అడిగితే కొత్త ఉల్లి తొందరగా కుళ్లిపోతున్నదట! వర్షాలు అందుకు కారణమట! ఓరి దేవుడో.. ఉల్లిని నమ్ముకుని మళ్లీ నష్టపోయాం అంటూ తలలు పట్టుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల రైతులు.. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఎనిమిది వేల రూపాయలే చేతికి వచ్చిందని వాపోతున్నారు.. పాపం ఏడుపొక్కటే తక్కువ!