హైదరాబాద్‌‌లో ఒరాకిల్ డేటా సెంటర్

|

Jul 01, 2020 | 3:58 PM

తెలంగాణలోకి మరో ఐటీ దిగ్గజం ఒరాకిల్ వచ్చి చేరింది. ఇండియాలో తన రెండో డేటా సెంటర్‌‌‌‌ను హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసింది. గతేడాది తొలి డేటా సెంటర్‌‌‌‌ను ముంబైలో ప్రారంభించిన ఒరాకిల్, రెండో సెంటర్‌‌‌‌ను భాగ్యనగరంలో నెలకొల్పింది.

హైదరాబాద్‌‌లో ఒరాకిల్ డేటా సెంటర్
Follow us on

తెలంగాణలోకి మరో ఐటీ దిగ్గజం ఒరాకిల్ వచ్చి చేరింది. ఇండియాలో తన రెండో డేటా సెంటర్‌‌‌‌ను హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసింది. గతేడాది తొలి డేటా సెంటర్‌‌‌‌ను ముంబైలో ప్రారంభించిన ఒరాకిల్, రెండో సెంటర్‌‌‌‌ను భాగ్యనగరంలో నెలకొల్పింది. ఈ ఏడాది చివరికల్లా 36 సెకండ్ జనరేషన్ క్లౌడ్ రీజియన్లను ఆపరేట్ చేయాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా క్లౌడ్ జనరేషన్ కు అనుగుణంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌‌లలో కూడా ఈ సెంటర్లను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం, కొత్త క్లయింట్స్ నుంచి క్లౌడ్ సర్వీ స్‌ ల కోసం డిమాండ్ పెరుగుతోన్న క్రమంలో, ఈ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేసినట్టు ఒరాకిల్ ఇండియా తెలిపింది. టెలికాం రంగం, బ్యాంకింగ్ సెక్టార్ లాంటి క్రిటికల్ సర్వీసుల నుంచి డిమాండ్ బాగా వస్తోందన్నారు సంస్థ ప్రతినిధి. ఇండియాలోని రెండు డేటా సెంటర్ల ద్వారా 15 వేలకు పైగా క్లయింట్లకు సేవలందుతున్నాయని.. కరోనా వల్ల వీటిలో చాలా సర్వీసులను వర్క్ ఫ్రమ్ హోమ్‌ మోడల్‌లో ఆఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు.