బెజవాడలో దారుణం.. సినీ ఫక్కీలో పెట్రోల్‌తో దాడి

విజయవాడ నోవాటేల్ హోటల్ వద్ద దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ గొడవలతో ఓ వ్యక్తిని కారులోనే సజీవ దహనం చేసేందుకు దుండగులు..

బెజవాడలో దారుణం.. సినీ ఫక్కీలో పెట్రోల్‌తో దాడి

Updated on: Aug 17, 2020 | 8:05 PM

Patrol attack in Vijayawada : విజయవాడ నోవాటేల్ హోటల్ వద్ద దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ గొడవలతో ఓ వ్యక్తిని కారులోనే సజీవ దహనం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. కారులో వస్తుండగా పెట్రోల్‌ పోసి నడిరోడ్డుపైనే నిప్పంటించారు. కళ్లుమూసి తెరిచేలోపే కారును మంటలు చుట్టుముట్టాయి. అంతా సినీ ఫక్కీలో హత్యకు ప్లాన్‌ చేశాడు కృష్ణారెడ్డి. సమయం చూసి కారులో ఉన్న నలుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

కారులో ఉన్న నలుగురిలో గంగాధర్‌, నాగవల్లి, వేణుగోపాల్‌రెడ్డిలు క్షేమంగా బయటపడగా… మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఎవరనేది గుర్తించాల్సి ఉంది. సమాచారంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు..రియల్‌ ఎస్టేట్‌ గొడవలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

అయితే.. గాయాలపాలైన వేణుగోపాల్ రెడ్డి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వివాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.