పారా గ్లైడింగ్ లో హైదరాబాదీ శునకం…వావ్ !

|

Jul 29, 2019 | 5:45 PM

హైదరాబాద్ నుంచి ఢిల్లీ సమీపంలోని నొయిడాకు తన 28 రోజుల వయస్సులో ‘ తరలి వెళ్లిన ‘ కుక్క ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ‘ రాచభోగాలు ‘ అనుభవిస్తోంది. ప్రస్తుతం దీని వయస్సు ఏడాది ఆరునెలలు. నోయిడాకు చెందిన వికాస్ త్యాగి అనే వ్యక్తి దీన్ని గతంలో తను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతో ముచ్చట పడి తనవెంట తీసుకువెళ్లాడట. ఈ మధ్యే హిమాచల్ ప్రదేశ్ లోని టూరిస్ట్ స్పాట్ అయిన మనాలీని విజిట్ చేసినప్పుడు తన […]

పారా గ్లైడింగ్ లో హైదరాబాదీ శునకం...వావ్ !
Follow us on

హైదరాబాద్ నుంచి ఢిల్లీ సమీపంలోని నొయిడాకు తన 28 రోజుల వయస్సులో ‘ తరలి వెళ్లిన ‘ కుక్క ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ‘ రాచభోగాలు ‘ అనుభవిస్తోంది. ప్రస్తుతం దీని వయస్సు ఏడాది ఆరునెలలు. నోయిడాకు చెందిన వికాస్ త్యాగి అనే వ్యక్తి దీన్ని గతంలో తను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతో ముచ్చట పడి తనవెంట తీసుకువెళ్లాడట. ఈ మధ్యే హిమాచల్ ప్రదేశ్ లోని టూరిస్ట్ స్పాట్ అయిన మనాలీని విజిట్ చేసినప్పుడు తన ‘ ప్రియ నేస్తమైన ‘ ఈ కుక్కతో పారాగ్లైడింగ్ చేశాడు. భూమికి 3,500 అడుగుల ఎత్తున దాదాపు పావుగంట సేపు వికాస్ త్యాగి.. ఈ శునకాన్ని భద్రంగా పట్టుకుని ఆకాశంలో విహారం చేశాడు. పర్వతాలు, ఎత్తయిన చెట్లు, చల్లని గాలితో కూడిన ప్రకృతిని చూస్తూ ఈ ‘ కుక్కగారు ‘ కూడా తన యజమానితో బాటు ఎంజాయ్ చేసింది. గతనెల 30 న జరిగిందీ అరుదైన ఘటన. అన్నట్టు దీనిపేరు ‘ నవాబ్ ‘ అండోయ్.. భాగ్యనగరానికి చెందిన ఈ శునకానికి మనం కూడా బెస్ట్ విషెస్ చెబుదాం.