కరోనా ఎఫెక్ట్: టోక్యో ఒలింపిక్స్‌పై జపాన్ కీలక నిర్ణయం

| Edited By:

Mar 24, 2020 | 7:00 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 ఉధృతి రోజురోజుకు పెరుగుతుండ‌టంతో ప్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలిపింక్స్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌

కరోనా ఎఫెక్ట్: టోక్యో ఒలింపిక్స్‌పై జపాన్ కీలక నిర్ణయం
Follow us on

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 ఉధృతి రోజురోజుకు పెరుగుతుండ‌టంతో ప్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలిపింక్స్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలిన నేపథ్యంలో చివరి నిమిషంలో జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఎలాగైనా అనుకున్న సమయానికి ఒలింపిక్స్ నిర్వహించాలని మొదట్లో అనుకున్నప్పటికీ కరోనా తీవ్రత పెరగడంతో వాయిదా వేయక తప్పలేదు. జపాన్ సైతం దీనిపై చాలా ఖర్చు చేసింది. అయితే ఊహించని రీతిలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతుండటంతో జపాన్ వెనక్కి తగ్గక తప్పలేదు.