
తెలుగు ప్రజల మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ అనుష్క కొత్త సినిమా అనౌన్సిమెంట్ వచ్చేసింది. నేడు(నవంబరు 7) స్వీటీ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలుపుతూ యూవీ క్రియేషన్స్ ఈ అధికార ప్రకటన చేసింది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నట్లు వెల్లడించింది. న్యూ ఏజ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందనుందని తెలిపింది. అనుష్కకు ఇది 48వ ఫిల్మ్.
ఈ సినిమాను ‘రా రా కృష్ణయ్య’ ఫేం మహేశ్ తెరకెక్కించనున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్నారని మొదట్లో వార్తలు సర్కులేట్ అయ్యాయి. ఆ తర్వాత అతను తప్పుకున్నారని ప్రచారం సాగింది. అయితే ఈ మూవీలో మరో యంగ్ హీరో నటించనున్నారని తెలిసింది. కాగా గతంలో అనుష్కతో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రెండు సినిమాలు నిర్మించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’, ‘భాగమతి’ చిత్రాల్లో ఆమె నటించింది.
నేడు స్వీటీ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఆమె ఫ్యాన్స్‌తో పాటు సౌత్ ఇండియాలోని పలువురు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కేవలం అందం, అభినయంతోనే కాకుండా.. తన స్వచ్చమైన మనసుతో, సేవాగుణంతో ఎంతోమంది హృదయాల్లో చోటు సంపాదించుకుంది అనుష్క.
Also Read: అభిమానులందరి సమక్షంలో అమ్మాయికి ప్రపోజ్ చేసిన ఆర్ఎక్స్ 100 హీరో.. ఎమోషనల్ అయిన లోహిత..