Odisha Miniature Artist:అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ప్రపంచ దేశాలనుంచి అభినందనలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు తమ అభిమానాన్ని విభిన్న రీతుల్లో చాటుకుంటున్నారు. తాజాగా పెద్దన్న జో బైడెన్ పై ఉన్న తన అభిమానాన్ని ఓ చిత్రకారుడు వినూత్న రీతిలో చాటుకున్నాడు. ఒడిశా కు చెందిన ఎల్. ఈశ్వర్ జో ఫోటోను ఓ సీసాలో ఏర్పాటు చేశాడు. నూతన అధ్యక్షడిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ కు తన శుభాకాంక్షలను తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్ర కారుడు ప్రతిభకు ప్రశంసలు అందుతున్నాయి.
మరోవైపు అమెరికా చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతానికి కౌంట్ డౌన్ స్టార్ అయ్యింది. అమెరికాకు 46వ అధ్యక్షడిగా జో బైడెన్, ఉపాధ్యక్షరాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఈమేరకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా అధ్యక్ష పదవి కన్నా ముందే ఉపాధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం జరుగుతుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం పది గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. అంటే ఇండియన్ టైమింగ్స్‌లో 2021, జనవరి 20వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రమాణస్వీకారోత్సవం ప్రారంభం కానున్నది.
Also Read: పొరుగుదేశాలకే ఫస్ట్.. ఈరోజు నుంచి వ్యాక్సిన్ ఎగుమతి.. ముందుగా భూటాన్, మాల్దీవులకు అందజేత