డబ్ల్యూఎఫ్‌పీకి నోబెల్‌ శాంతి బహుమతి

వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌- డబ్ల్యూఎఫ్‌పీకి ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.. వ్యక్తులకు కాకుండా కోట్లాది మంది ఆకలిని తీరుస్తున్న డబ్ల్యూఎఫ్‌పీకి ఈ పురస్కారం ఇవ్వడం అభినందనీయం.. ఎక్కడ ఆకలి సమస్య ఉంటే అక్కడ డబ్లూఎఫ్‌పీ వెళుతుంది.. ఆ సమస్యను పరిష్కరిస్తుంది.. జనం ఆకలిని తీరుస్తుంది.. అలాగే ప్రచ్ఛన్న యుద్ధాలతో, పరోక్ష యుద్ధాలతో ఇక్కట్లు పడుతున్న ప్రతీచోటకు ఈ సంస్థ వెళ్లి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేందుకు పాటుపడుతుంది.. ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూఎఫ్‌పీ ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ […]

డబ్ల్యూఎఫ్‌పీకి నోబెల్‌ శాంతి బహుమతి

Updated on: Oct 09, 2020 | 4:25 PM

వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌- డబ్ల్యూఎఫ్‌పీకి ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.. వ్యక్తులకు కాకుండా కోట్లాది మంది ఆకలిని తీరుస్తున్న డబ్ల్యూఎఫ్‌పీకి ఈ పురస్కారం ఇవ్వడం అభినందనీయం.. ఎక్కడ ఆకలి సమస్య ఉంటే అక్కడ డబ్లూఎఫ్‌పీ వెళుతుంది.. ఆ సమస్యను పరిష్కరిస్తుంది.. జనం ఆకలిని తీరుస్తుంది.. అలాగే ప్రచ్ఛన్న యుద్ధాలతో, పరోక్ష యుద్ధాలతో ఇక్కట్లు పడుతున్న ప్రతీచోటకు ఈ సంస్థ వెళ్లి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేందుకు పాటుపడుతుంది.. ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూఎఫ్‌పీ ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంస్థ అని, ఆకలి సమస్యను ఎదుర్కోవడం, ఆహార భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ సంస్థ విశేష సేవలందిస్తోందని నోబెల్‌ కమిటీ తెలిపింది.. ఈ సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించింది. అవాంఛనీయ యుద్ధాలు.. సంక్షోభపరిస్థితులు.. ప్రకృతి విపత్తుల కారణంగా కోట్లాది మంది ఆకలితో నకనకలాడుతున్నారని, వారి కడుపు నింపడమే డబ్ల్యూఎఫ్‌పీ కర్తవ్యమని నోబెల్‌ కమిటీ తెలిపింది. గత సంవత్సరం 135 మిలియన్‌ మంది ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. వారి బాధలను తీర్చడానికి డబ్ల్యూఎఫ్‌పీ అహర్నిశలు పాటుపడుతూ వస్తోంది.. గతేడాది 88 దేశాల్లో దాదాపు 100 మిలియన్ల మంది ఆకలి తీర్చింది డబ్ల్యూఎఫ్‌పీ. ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది.. కరనో కారణంగా చాలా మందికి తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకడం లేదు.. యెమన్‌, కాంగో, నైజీరియా, దక్షిణ సూడాన్‌, బుర్కినాఫాసో వంటి ఆఫ్రికా దేశాలలో కరువు కాటకాలు, హింసాత్మక ఘర్షణలు, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వారి కోసమే డబ్ల్యూఎఫ్‌పీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది.

Loading...
Unable to load recommendations.
Follow Us