విమానంలో సెలబ్రిటీలు, వీవీఐపీలతో సిబ్బంది సెల్ఫీలు దిగవద్దని ఎయిర్ ఇండియా ఆదేశించింది. సెలబ్రిటీలు, వీవీఐపీలు విమానంలో ప్రయాణిస్తున్నపుడు వారి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులను కోరింది. వారి గోప్యతకు భంగం కలిగిస్తూ కొందరు విమాన పైలెట్, ఉద్యోగులు సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారని, అలాంటివి ఇక ముందు చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టరు జారీ చేసిన ఆదేశాల్లో హెచ్చరించారు. వీఐపీలు, సెలబ్రిటీలు ప్రశాంతంగా ప్రయాణించేలా చూడాలని, వారికి అంతరాయం కల్పిస్తే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా డైరెక్టరు హెచ్చరించారు.