వన్డేల్లో సూపర్ ఓవర్ అనవసరం: రాస్ టేలర్

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడిన ఈ ఫైనల్‌తో సహా సూపర్ ఓవర్‌లో కూడా స్కోర్లు సమం కావడంతో..

వన్డేల్లో సూపర్ ఓవర్ అనవసరం: రాస్ టేలర్

Updated on: Jun 27, 2020 | 2:07 PM

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడిన ఈ ఫైనల్‌తో సహా సూపర్ ఓవర్‌లో కూడా స్కోర్లు సమం కావడంతో.. బౌండరీలు  ఇంగ్లాండ్ జట్టుకు టైటిల్ దక్కింది. ఈ విషయంపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగిందని చెప్పాలి. ఐసీసీ విధించిన ఈ రూల్‌పై సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక దీనిపై తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ స్పందించాడు.

వన్డే ఫార్మట్‌లో సూపర్ ఓవర్ అవసరం లేదని, మెగా టోర్నమెంట్‌లో సూపర్ ఓవర్ సమం అయితే.. ట్రోఫీని ఇరు జట్లకు పంచాలని తెలిపాడు. ఎప్పటి నుంచో ఆడుతున్న ఈ వన్డే ఫార్మాట్లో 100 ఓవర్లకు కూడా స్పష్టమైన విజేత ఎవరన్నది తెలియకపోతే.. టైటిల్‌ను ఇరు జట్లకు పంచాలని.. వారినే సంయుక్త విజేతగా ప్రకటించాలని రాస్ టేలర్ స్పష్టం చేశాడు. సూపర్ ఓవర్ టీ20 ఫార్మాట్లో ఉన్నా ఫర్వాలేదు గానీ.. వన్డేలకు మాత్రం అవసరం లేదన్నాడు.