బడ్జెట్ సెషన్‌లో మండలి భేటీ లేనట్లే!

శాసనమండలిలో వున్న బలంతో ప్రతీ పనికి మోకాలడ్డుతున్న తెలుగుదేశం పార్టీకి షాకిచ్చేందుకు కౌన్సిల్ రద్దుకు జగన్ ప్రభుత్వం పూనుకున్నా.. మునుముందు ఏం జరగబోతోంది అన్నదిపుడు చర్చగా మారింది. సుదీర్ఘ కాలం తర్వాత ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే.. పిబ్రవరిలోనే జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో మండలి భేటీ అవుతుందా? లేక అసెంబ్లీ తీర్మానమే ఫైనల్ అన్నట్లుగా కేవలం శాసనసభ మాత్రమే భేటీ అయి.. బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుందా? ఈ ప్రశ్న ఇపుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. సోమవారం మండలిని […]

బడ్జెట్ సెషన్‌లో మండలి భేటీ లేనట్లే!
Follow us

|

Updated on: Jan 28, 2020 | 2:08 PM

శాసనమండలిలో వున్న బలంతో ప్రతీ పనికి మోకాలడ్డుతున్న తెలుగుదేశం పార్టీకి షాకిచ్చేందుకు కౌన్సిల్ రద్దుకు జగన్ ప్రభుత్వం పూనుకున్నా.. మునుముందు ఏం జరగబోతోంది అన్నదిపుడు చర్చగా మారింది. సుదీర్ఘ కాలం తర్వాత ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే.. పిబ్రవరిలోనే జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో మండలి భేటీ అవుతుందా? లేక అసెంబ్లీ తీర్మానమే ఫైనల్ అన్నట్లుగా కేవలం శాసనసభ మాత్రమే భేటీ అయి.. బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుందా? ఈ ప్రశ్న ఇపుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.

సోమవారం మండలిని రద్దు చేసిన తర్వాత పార్లమెంటు ఆమోదానికి రాష్ట్రపతి రాజముద్ర పడే వరకు మండలి వుంటుందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. దాని ప్రకారం చూస్తే.. బడ్జెట్ సమావేశాల్లో మండలి భేటీ వుంటుందా? ఒకసారి వద్దన్న మండలిని కేవలం బడ్జెట్ ఆమోదం కోసం మళ్ళీ సమావేశపరుస్తారా? ఒకవేళ సమావేశపరిచినా మళ్ళీ తెలుగుదేశం వ్యూహంతో బడ్జెట్ ఆమోదంలోను అధికార పార్టీ ఇరకాట పరిస్థితిని ఎదుర్కోదా? ఇలాంటి ప్రశ్నలు పలువురిలో వినిపిస్తున్నాయి.

అయితే, తాజా సమాచారం మేరకు బడ్జెట్ సమావేశాల్లో కేవలం అసెంబ్లీ మాత్రమే సమావేశమవుతుందని తెలుస్తోంది. సభా సమావేశాలను నోటిఫై చేయాల్సింది అసెంబ్లీ కార్యదర్శి కాబట్టి.. ఆయనే మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి, పార్లమెంటుకు పంపుతున్నందున ఇక మళ్ళీ మండలి భేటీకి ఎలా నోటిఫికేషన్ ఇస్తారని శాసనసభ సచివాలయ వర్గాలు ఎదురు ప్రశ్నిస్తున్నాయి. ఈ లెక్కన బడ్జెట్ సమావేశాల్లో కేవలం శాసనసభ ఒక్కటే సమావేశమై.. బడ్జెట్‌పై చర్చించి, ఆమోదం తెలుపుతుందని విశ్వసనీయ సమాచారం.