చిదంబరానికి మరో షాక్.. బెయిల్ పిటిషన్‌ కొట్టివేత..!

ఢిల్లీ హైకోర్టులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. చిదంబరం బయటికి వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ […]

చిదంబరానికి మరో షాక్.. బెయిల్ పిటిషన్‌ కొట్టివేత..!

Edited By:

Updated on: Sep 30, 2019 | 4:41 PM

ఢిల్లీ హైకోర్టులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. చిదంబరం బయటికి వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢీల్లీ హైకోర్టుకు ఇదివరకే తెలిపారు. ఈ కేసులు అరెస్టు అయిన చిదంబరమే ఆధారాలన్నింటినీ మాయం చేశారని ఆయన కోర్టుకు విన్నవించారు. ప్రస్తుతం చిదంబరం తీహార్ జైలులో ఉన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us