బీహార్ లో ఇక పదవుల పందేరం, బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం, ఓ స్పీకర్ పదవులు, సీఎంగా నేడు నితీష్ ప్రమాణం

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నాలుగోసారి సీఎం పీఠమెక్కబోతున్నారు.

బీహార్ లో ఇక పదవుల పందేరం, బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం, ఓ స్పీకర్ పదవులు, సీఎంగా నేడు నితీష్ ప్రమాణం

Edited By:

Updated on: Nov 16, 2020 | 10:54 AM

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నాలుగోసారి సీఎం పీఠమెక్కబోతున్నారు. కాగా తమకు రెండు డిప్యూటీ సీఎం పదవులు, ఓ స్పీకర్ పదవి కావాలని బీజేపీ పట్టుబట్టడంతో నితీష్ కి అంగీకరించక తప్పలేదు. గత రాత్రి ఈ విషయమై ఆయనకు, బీజేపీ టాప్ లీడర్లకు మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఇప్పటికే బీజేపీకి చెందిన తర్కిషోర్ ప్రసాద్, రేణు దేవి ఉప ముఖ్యమంత్రులు అవుతారని వార్తలు వచ్చాయి. మరోవైపు ఇప్పటివరకు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ మోడీకి  కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించవచ్ఛునని తెలుస్తోంది. తమకు కీలక పదవులు ఇవ్వాలని కమలం పార్టీ నితీష్ ను పట్టుబట్టినట్టు సమాచారం.

రాష్ట్రంలో ఇకపై నితీష్ ఆధ్వర్యంలోని జేడీ-యూ కన్నా బీజేపీ ప్రాధాన్యం పెరుగుతుందని, ఈ పార్టీదే పై చేయి కానుందని తెలుస్తోంది. ముఖ్య నిర్ణయాల్లో బీజేపీ నేతలకే ప్రాధాన్యం లభిస్తుందని అంటున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us