చౌకబారు విమర్శలను తిప్పికొట్టిన టీవీ9 సీఈఓ రవిప్రకాష్

టీవీ9- మెరుగైన సమాజం కోసం. ఆ విషయాన్నే మరోసారి స్పష్టం చేశారు టీవీ సీఈఓ రవిప్రకాష్. వాస్తవికత లేకుండా తనపై తప్పుడు వార్తలు ప్రసారాలు చేసిన పలు ఛానల్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రవిప్రకాష్ ఎక్కడికో పారిపోయాడు, ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు అంటూ వస్తున్న రూమర్లపై ఆయన బంజారాహిల్స్ టీవీ9 సాక్షిగా కౌంటరిచ్చారు. టీవీ9 వ్యవస్థాపకుడిగా, ఛైర్మన్‌గా, సీఈఓగా బంజారాహిల్స్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ నుంచి లైవ్‌లో మాట్లాడుతూ చౌకబారు విమర్శలను తిప్పికొట్టారు.  […]

చౌకబారు విమర్శలను తిప్పికొట్టిన టీవీ9 సీఈఓ రవిప్రకాష్
Ram Naramaneni

|

May 09, 2019 | 8:24 PM

టీవీ9- మెరుగైన సమాజం కోసం. ఆ విషయాన్నే మరోసారి స్పష్టం చేశారు టీవీ సీఈఓ రవిప్రకాష్. వాస్తవికత లేకుండా తనపై తప్పుడు వార్తలు ప్రసారాలు చేసిన పలు ఛానల్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రవిప్రకాష్ ఎక్కడికో పారిపోయాడు, ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు అంటూ వస్తున్న రూమర్లపై ఆయన బంజారాహిల్స్ టీవీ9 సాక్షిగా కౌంటరిచ్చారు. టీవీ9 వ్యవస్థాపకుడిగా, ఛైర్మన్‌గా, సీఈఓగా బంజారాహిల్స్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ నుంచి లైవ్‌లో మాట్లాడుతూ చౌకబారు విమర్శలను తిప్పికొట్టారు.  గత 15 సంవత్సరాలుగా టీవీ9 ఒక స్పష్టమైన విజయకేతనాన్ని ఎగరవేసిందని ఆయన గుర్తు చేశారు. జర్నలిజం అంటే మసాలా వార్తలు కాదని..సమాజంలో మార్పు తీస్కురావడమే లక్ష్యమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చానల్‌కు సంబంధించి ఒక కేసును ఎన్‌సీఎల్టీ కోర్టు స్వీకరించిందని..ఆ కేసును ఈ నెల 16వ తారీఖున విచారణకు రాబోతోందని..ఆ వివాదాన్ని ఆసరాగా పెట్టుకుని కొంతమంది తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారని అన్నారు. సత్యం మాత్రమే ఎప్పటికీ నిలబడుతుందన్న రవిప్రకాష్..టీవీ9,  15 సంవత్సరాల నుంచి టాప్ ప్లేస్‌లో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎవరో ఇచ్చిన దనానికి ఆశపడి కొన్ని మీడియా సంస్థలు వార్తల ప్రసారం చేయకుండా ఉండి ఉంటే..ప్రజల్లో ఆ చానల్స్ పట్ల కూడా విశ్వసనీయత పెరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిజం అంటే సామాజిక భాద్యత అనే అంశాన్ని టీవీ9 మనసులో నింపుకుని తెలుగు ప్రజలకు నిర్వీరామంగా సేవ చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

TV9- FOR BETTER SOCIETY

CEO-RAVI PRAKSH

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu