
New Year Celebrations : నూతన సంవత్సర వేడుకలపై కేంద్రం నిఘా పెట్టింది. కరోనాతోపాటు స్ట్రెయిన్ విస్తరిస్తుండటంతో కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. న్యూ ఇయర్ వేడుకల పేరుతో కరోనా వ్యాప్తిని పెంచే కార్యక్రమాలు, సంబరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై గట్టి నిఘా పెట్టాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు.
ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడటాన్ని నివారించాలని లేఖలో పేర్కొన్నారు. కరోనా ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వుల్లోని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రాలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మహమ్మారి వ్యాప్తి నివారణకు రాత్రి కర్ఫ్యూలాంటి స్థానిక ఆంక్షలు విధించుకోవచ్చని పేర్కొన్నారు.
అయితే వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు రాజేష్‌భూషణ్ రాష్ట్రాలకు గుర్తుచేశారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని డిసెంబర్ 31తోపాటు, జనవరి 15నాడుకూడా తగిన ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.
Also Read:
ఉపాధ్యాయుల బదిలీలు.. పాఠశాలల ఎంపికకు ఇవాళ్టితో చివరి రోజు.. ఎంపిక ప్రక్రియకు కొంత ఆలస్యమయ్యే ఛాన్స్