Covid Strain Cases In India: ఇండియాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందరూ ఊరటగా ఉన్న వేళ కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. దేశంలో కోవిడ్ స్ట్రెయిన్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 82 స్ట్రెయిన్ వైరస్ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. జనవరి 6న ఈ సంఖ్య 73గా ఉంది. స్ట్రెయిన్ సోకినవారి పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వారిని సింగిల్ రూమ్ ఐసోలేషన్లో ఉంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ వైరస్ సోకినవారితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
స్ట్రెయిన్ వైరస్ కట్టడిని అడ్డుకునేందుకు కేంద్రం భారత్-యూకే మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ బ్యాన్ ఎత్తివేశారు. జనవరి 6న భారత్ నుంచి యూకేకు తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.. నేడు యూకే-భారత్ సేవలు పునరుద్ధరించారు. అయితే బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయనున్నారు. అంతేగాక, విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్లో ఉండాలని అధికారులు నిబంధన విధించారు.
Also Read :
APPSC Recruitment 2021: కీలక నిర్ణయం దిశగా ఏపీపీఎస్సీ.. ఇకపై పరీక్షలన్నీ ఆన్లైన్లోనే !