పీఓకేను పాక్‌కు ఇచ్చింది నెహ్రూనే…

| Edited By:

Jun 28, 2019 | 9:06 PM

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాని కాంగ్రెస్ ఆరోపణలపై మండిపడ్డారు అమిత్ షా. అసలు ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జమ్ముకశ్మీర్‌లో 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని.. అందులో 93 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని విమర్శించారు. ఒకప్పుడు కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. పీఒకేను నెహ్రూ పాకిస్థాన్‌కు అప్పజెప్పారని అమిత్ షా […]

పీఓకేను పాక్‌కు ఇచ్చింది నెహ్రూనే...
Follow us on

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాని కాంగ్రెస్ ఆరోపణలపై మండిపడ్డారు అమిత్ షా. అసలు ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జమ్ముకశ్మీర్‌లో 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని.. అందులో 93 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని విమర్శించారు. ఒకప్పుడు కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. పీఒకేను నెహ్రూ పాకిస్థాన్‌కు అప్పజెప్పారని అమిత్ షా ఆరోపించారు.