మంత్రి ఇంటిముందు పీతలు వదిలి..నిరసన

|

Jul 09, 2019 | 5:51 PM

పీతల వల్లే తివారే డ్యాం కూలిపోయిందంటూ మహారాష్ట్ర మంత్రి తనాజీ సావంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. మీ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి తలాతోకాలేని కామెంట్లు చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. అంతటితో ఆగకుండా..తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఓ బాక్సు నిండా పీతలను నింపి వాటిని ఆయన ఇంటిముందు వదిలారు. సుమారు 48 సెకండ్ల ఈ వీడియో వైరల్ అవుతోంది. రత్నపురి జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు, వరదలకు తివారే డ్యాం […]

మంత్రి ఇంటిముందు పీతలు వదిలి..నిరసన
Follow us on

పీతల వల్లే తివారే డ్యాం కూలిపోయిందంటూ మహారాష్ట్ర మంత్రి తనాజీ సావంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. మీ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి తలాతోకాలేని కామెంట్లు చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. అంతటితో ఆగకుండా..తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఓ బాక్సు నిండా పీతలను నింపి వాటిని ఆయన ఇంటిముందు వదిలారు. సుమారు 48 సెకండ్ల ఈ వీడియో వైరల్ అవుతోంది. రత్నపురి జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు, వరదలకు తివారే డ్యాం కూలిపోయిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఏడు గ్రామాలు ముంపునకు గురికాగా.. దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఈ ఉత్పాతానికి కారణమైన పీతలను అరెస్టు చేయాలంటూ సావంత్ హేళనగా కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డారు. మనుషుల ప్రాణాలంటే మీకు లెక్క లేనట్టు ఉందని ఎన్సీపీ వంటి విపక్షాలు ఆయనపై మండిపడ్డాయి.