Nayanthara : సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార మీడియాకు దూరంగా ఉండటానికి ఆ హీరో కారణమట..ఇంట్రస్టింగ్ న్యూస్

|

Dec 28, 2020 | 9:57 PM

అన్నాత్తే షూట్‌లో కోవిడ్‌ కేసులు రావటంతో ఆ షూట్‌కు సడన్‌గా బ్రేక్‌ పడింది. ఈ షాక్‌తో రజనీ హాస్పిటలైజ్‌ అయి డిశ్చార్జ్‌ కూడా అయ్యారు. హీరోయిన్‌ నయనతార మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో చిల్‌ అవుతున్నారు.

Nayanthara : సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార మీడియాకు దూరంగా ఉండటానికి ఆ హీరో కారణమట..ఇంట్రస్టింగ్ న్యూస్
Follow us on

అన్నాత్తే షూట్‌లో కోవిడ్‌ కేసులు రావటంతో ఆ షూట్‌కు సడన్‌గా బ్రేక్‌ పడింది. ఈ షాక్‌తో రజనీ హాస్పిటలైజ్‌ అయి డిశ్చార్జ్‌ కూడా అయ్యారు. హీరోయిన్‌ నయనతార మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో చిల్‌ అవుతున్నారు. ప్రజెంట్ క్రిస్మస్‌, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు నయన్‌ – విఘ్నేష్‌. ఈ బ్యూటీని పలకరించాలనుకున్న మీడియాకు మళ్లీ నో కామెంట్స్ అన్న ఆన్సరే వినిపించిందట.

అసలు నయన్ ఎందుకు మీడియాతో మాట్లాడరు.. కనీసం సినిమా ప్రమోషన్‌ టైంలో కూడా ఇంటర్వ్యూలు ఇవ్వరెందుకు..? ఈ డౌట్స్‌ ఫ్యాన్స్‌లో చాలా కాలంగా ఉన్నాయి. అయితే నయన్‌ మౌనానికి కారణం హీరో అజిత్ అట.. అవును అజిత్‌ కారణంగానే నయన్‌ ఇంటర్వ్యూలకు, ప్రమోషన్ యాక్టివిటీస్‌కు దూరంగా ఉంటున్నారు.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అజిత్ కూడా యడా పెడా మీడియాతో మాట్లాడేశారు. అయితే ఆ టైంలో అజిత్ చేసిన కామెంట్స్‌ను కొంత మంది నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేశారు. దీంతో బాగా హర్ట్ అయిన అజిత్‌ నో ప్రమోషన్.. నో ఇంటర్వ్యూ అని ఒట్టు పెట్టేసుకున్నారు. ఈ విషయాన్నే నయన్‌తోను చెప్పడంతో ఈ అమ్మడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారట. అదీ… అలా అజిత్‌ కారణంగా పబ్లిక్‌ అపియరెన్స్‌కు దూరమయ్యారు సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయన్‌.

Also Read :

House sites distribution : ఇళ్ల పట్టాలు చేతికందిన ఆనందం.. లబ్దిదారులు సీఎంపై ఇలా చూపించారు అభిమానం

Madduvalasa Fishes : మడ్డువలస చేపలు..క్యూ కడుతున్న జనాలు..ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు !

Tirumala News : కలశం గుర్తును శిలువగా తప్పుడు ప్రచారం..టీటీడీ సీరియస్..పోలీసులకు ఫిర్యాదు..