ఐపీఎల్‌లో ఆడేందుకు నో పర్మిషన్..

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ఐపీఎల్‌లో ఆడేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) అనుమతి నిరాకరించింది. అక్టోబర్ 24 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ఉన్నందున బీసీబీ అతన్ని ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వలేదు.

ఐపీఎల్‌లో ఆడేందుకు నో పర్మిషన్..

Updated on: Sep 10, 2020 | 5:29 PM

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ఐపీఎల్‌లో ఆడేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) అనుమతి నిరాకరించింది. అక్టోబర్ 24 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ఉన్నందున బీసీబీ అతన్ని ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వలేదు. దీనితో ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి ముస్తాఫిజుర్ దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ముస్తాఫిజుర్‌ను తీసుకునేందుకు ప్రయత్నించాయి. అయితే అనూహ్యంగా బీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. (Mustafizur denied NOC by BCB)

”ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌కు ఆఫర్ వచ్చింది. కానీ వచ్చే నెలలో శ్రీలంక టూర్ ఉన్నందున అతనికి ఎన్‌ఓసీ ఇవ్వలేదు” అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. కాగా, గతంలో బీసీబీ.. ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆడేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే.