ఏపీ అసెంబ్లీలోనే కాదు.. శాసనమండలిలో కూడా వాడివేడి చర్చ.. వీగిపోయిన పురపాలక పన్నుల చట్ట సవరణ బిల్లు

|

Dec 02, 2020 | 6:02 PM

మండలిలో పురపాలక పన్నుల చట్ట సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లును టీడీపీ, పీడీఎఫ్ సభ్యులు వ్యతిరేకించారు. బిల్లుకు వ్యతిరేకంగా 29 ఓట్లు...

ఏపీ అసెంబ్లీలోనే కాదు.. శాసనమండలిలో కూడా వాడివేడి చర్చ.. వీగిపోయిన పురపాలక పన్నుల చట్ట సవరణ బిల్లు
Follow us on

Municipal Tax : అసెంబ్లీలోనే కాదు…ఏపీ శాసనమండలిలో కూడా వాడివేడిగా చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య డైలాగ్‌ వార్‌ నడిచింది. మండలిలో పురపాలక పన్నుల చట్ట సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లును టీడీపీ, పీడీఎఫ్ సభ్యులు వ్యతిరేకించారు. బిల్లుకు వ్యతిరేకంగా 29 ఓట్లు, అనుకూలంగా 11 ఓట్లు వచ్చాయి. ఇక తటస్థంగా ఇద్దరు సభ్యులు ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తి పన్ను చట్టానికి సవరణ చేస్తూ పురపాలక శాఖ బిల్లును ప్రవేశ పెట్టింది.

కరోనా బారిన పడితే ప్రజాప్రతినిధులకే హాస్పిటల్స్‌లో బెడ్స్‌ దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి. తన కుటుంబానికి ఎదురైన అనుభవాన్ని ఏపీ శాసనమండలిలో ఆయన ప్రస్తావించారు. ఎమ్మెల్సీనైన తనకే ఈ పరిస్థితి ఎదురైదే సామాన్యుల పరిస్థితేంటని వాకాటి ప్రశ్నించారు.

ఇక ఆంధ్రప్రదేశ్ మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరిగాయి. నేటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. మొత్తం 11 బిల్లులపై చర్చ చేపట్టారు. వీటిలో 5 బిల్లులపై శాసనమండలిలో చర్చించనున్నారు. ఇక ఉభయ సభలలో కరోనా కట్టడి, పోలవరం ప్రాజెక్టు అంశం, బీసీ సంక్షేమ కార్పొరేషన్‌పై చర్చ జరగనుంది. అలాగే ఉద్యోగుల సంక్షేమం, రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపైనా సభ్యులు చర్చించనున్నారు.