పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా ఆఫీసు వియాన్ లోను, అంధేరీలో జెఎల్ స్ట్రీమ్ కార్యాలయంలోనూ రహస్యంగా దాచిన కప్ బోర్డులను ముంబై పోలీసులు కనుగొన్నారు. వీటిలో ఏముందోనని ఆరా తీస్తున్నారు. ఈ కేసులో టీవీ నటి, మోడల్ గెహనా వశిష్ట్ ప్రస్తుతం బెయిలుపై విడుదలై ఉంది. ఈమెను, మరో ఇద్దరిని పోలీసులు ఆదివారం ఇంటరాగేట్ చేయనున్నారు. వీరికి ఇదివరకే సమన్లు పంపారు. పోర్నోగ్రఫీ కేసులో గెహనా వశిష్ట్ ఎలియాస్ వందనా తివారీ గత ఫిబ్రవరిలోనే అరెస్టయింది. నాలుగు నెలల అనంతరం ఆమెకు బెయిల్ లభించింది. ఇక రాజ్ కుంద్రా కేసులో ఈడీ ఆయనపై ఫెమా, మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసింది. అతనికి బ్రిటన్ లో ఓ కంపెనీ కూడా ఉందని., ఇండియా నుంచి ఆ కంపెనీ ద్వారా ఆర్ధిక లావాదేవీలు జరుపుతున్నాడని ఇదివరకే పోలీసులు కనుగొన్నారు. రెండు బ్యాంకుల్లోని ఇతని ఖాతాల నుంచి రూ. 7.5 కోట్లను వారు సీజ్ చేశారు. మరిన్ని ఖాతాల విషయాన్నీ ఆరా తీస్తున్నారు.ఇలాగే ఇతని సహచరుడు ర్యాన్ బ్యాంకు అకౌంట్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
కాగా తన భర్తకు ఈ పోర్న్ చిత్రాల కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన ఏరోటికా చిత్రాలు మాత్రమే తీస్తాడు గానీ పోర్న్ మూవీలు తీయడని అతని భార్య, నటి శిల్పా శెట్టి పోలీసులకు చెప్పిన సంగతి విదితమే.. అవసరమైతే ఆమెను మరోసారి కూడా ఖాకీలు విచారించవచ్చునని తెలుస్తోంది. ఈ రహస్య కప్ బోర్డుల విషయమై వారు ఆమెను ప్రశ్నించవచ్చు. ఇక ఈడీ అధికారులు కూడా కుంద్రా కార్యాలయాలపై దాడులు చేసే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి : వెంకటేష్ గారు కాళ్లు పట్టుకున్నప్పుడు!అంటూ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన విలక్షణ నటుడు శ్రీతేజ్..:Narappa Shritej Video.