IPL 2020 MI vs RR ముంబై ఖాతాలో హ్యాట్రిక్ విజయం

ముంబై సేన మరోసారి ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో  అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై..

IPL 2020 MI vs RR ముంబై ఖాతాలో హ్యాట్రిక్  విజయం

Updated on: Oct 07, 2020 | 12:09 AM

Mumbai Indians Won : ముంబై సేన మరోసారి ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో  హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. అబుదాబి వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించగలిగాడు. సూర్య  47 బంతుల్లో 79 పరుగులు చేయగలిగాడు. 11 ఫోర్లు , 2 సిక్సర్లతో అద్భుతమైన ప్రదర్శన చేయగలిగాడు.

అజేయ అర్ధశతకంతో రాణించడంతో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టును బుమ్రా మ్యాజిక్ (4/20)తో తట్టు కోలేక పోయింది. బట్లర్‌ 70 / 44 బంతుల్లో,  5ఫోర్లు, 6 సిక్సర్లతో పోరాడాడు. ఈ గెలుపుతో రోహిత్‌సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా మూడో విజయం.

ముంబై విసిరిన 193 పరుగులను  ఛేదనలో బట్లర్ మినహా ఎవరూ పోరాడలేపోయారు. ముంబై పేసర్ల ధాటికి 12 పరుగులకే రాజస్థాన్‌ మూడు వికెట్లు కోల్పోయి చతికల పడింది. జైశ్వాల్‌, సంజు శాంసన్‌ డకౌటవ్వగా.. స్మిత్‌ ఆరు పరుగులకే ఇంటిదారి పట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహిపాల్ లొమ్రార్‌ (11/ 13 బంతుల్లో, 1×4)తో కలిసి బట్లర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.

అయితే లొమ్రార్‌ను రాహుల్ చాహర్‌  బోల్తా కొట్టించాడు. అనంతరం బట్లర్ గేర్‌ మార్చి బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో  50 పరుగులు సాధించాడు. తొలి 24 బంతుల్లో అతడు 24 పరుగులే చేశాడు. తర్వాత సిక్సర్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌కు ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. ఆఖర్లో ఆర్చర్‌ చేసిన పరుగులు ఓటమి అంతరాన్ని తగ్గించాయి. ముంబై బౌలర్లలో బుమ్రా (4/20), బౌల్ట్‌ (2/26), ప్యాటిన్సన్‌ (2/19) రాణించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us