హెడింగ్లే మైదానంలో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు సంబరాల్లో మునిగితేలుతోంది. అకేషన్ బాగా కుదిరింది. మన ఎమ్మెస్ ధోనీ బర్త్ డే కూడా కలిసొచ్చింది. తన 38 వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ క్రికెటర్… భార్య సాక్షి, కూతురు జివాలతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇంకేం.. ఆల్ రౌండర్స్ కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా కూడా ఈ కుటుంబంతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ధోనీ కేక్ కట్ చేస్తున్న దృశ్యం తాలూకు ఫోటోలను సాక్షి తన ఇన్ స్టా గ్రామ్లో పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఈ వీడియోను చూసిన ధోనీ ఫాన్స్ అంతా హ్యాపీ ! ఇదొక అద్భుతమైన ఫీల్ అంటూ సంబరపడని వాళ్ళు లేరు..