‘Most vulnerable tribes forced to eat less now’ కరోనాకు తర్వాత దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. 77 శాతం మందికి సరైన ఆహారం దొరకడం లేదని, 56 శాతం మందికి కనీస ఉపాధి కరువైందని రైట్ టు ఫుడ్ క్యాంపేన్, హంగర్ వాచ్ జరిపిన సర్వే తేలింది. ఆదివాసీలు అడవిలో దొరికే కర్రలను, పొగాకులను సేకరించేవారని, ఆ తర్వాత వాటిని అమ్మి ఇంటికి ఆహార పదార్థాలు కొనుక్కునే వారని ఆర్‌టీఎఫ్ కన్వినర్ దీప సిన్హా తెలిపారు. అయితే లాక్‌డౌన్ కారణంగా వారికి ఆ ఉపాధి కరువైందని పేర్కొన్నారు. దీంతో వారి ఆకలి కష్టాలు మరింత ఎక్కువయ్యాయని వివరించారు.
దేశంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిలో 74 శాతం మందికి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కనీస ఆహారం కరువైందని హంగర్ వాచ్ సంస్థ తెలిపింది. 54 శాతం మంది ఆదివాసీలకు, 69 శాతం ఓబీసీలకు కూటి కష్టాలు తప్పలేదని పేర్కొంది.