గూగుల్ సెర్చ్ హిస్టరీ… దేశ ప్రజలు ఎక్కువగా ఏ ఫోన్ల గురించి వెతికారో తెలుసా… పది ఫోన్లు ఇవే…

| Edited By: Pardhasaradhi Peri

Dec 21, 2020 | 2:22 PM

మన దేశంలో ప్రజలు గూగుల్‌లో వెతికిన ఫోన్ల జాబితాను తాజాగా ఆ సంస్థ విడుదల చేసింది. ఎక్కువ మంది సెర్చ్ చేసిన మొదటి 10 ఫోన్ల వివరాలను గూగుల్ తెలిపింది.

గూగుల్ సెర్చ్ హిస్టరీ... దేశ ప్రజలు ఎక్కువగా ఏ ఫోన్ల గురించి వెతికారో తెలుసా... పది ఫోన్లు ఇవే...
Follow us on

మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి మారుతున్నాడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, సాంకేతిక పరంగా తనను తాను మార్చుకుని ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో సాంకేతిక వినియోగం పెరిగిపోయింది. టీవీ, సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్, వెహికిల్స్‌ మనిషి జీవితంలో భాగమైపోయాయి.

 

అన్నింటిని వెతికేస్తున్నారు….

సాంకేతికతలో మనిషి ఉపయోగిస్తున్న వాటిలో ప్రధానమైనవి రెండు ఒకటి ఇంటర్నెట్, రెండు సెల్‌ఫోన్. అయితే మన దేశంలో ప్రజలు గూగుల్‌లో వెతికిన ఫోన్ల జాబితాను తాజాగా ఆ సంస్థ విడుదల చేసింది. ఎక్కువ మంది సెర్చ్ చేసిన మొదటి 10 ఫోన్ల వివరాలను గూగుల్ తెలిపింది. అవేంటంటే… రియల్ మీ ఫోన్లు 3, షియోమీ ఫోన్లు 3, వివో ఫోన్ 1, ఒప్పో ఫోన్ 1, ఐఫోన్ 1, వన్ ప్లస్ ఫోన్ 1 ఉన్నాయి.