గుడ్ న్యూస్: కరోనాపై పోరులో మరో ముందడుగు.. ట్రయల్స్ సక్సెస్!

| Edited By:

May 19, 2020 | 10:30 AM

కోవిద్-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనావైరస్ కు

గుడ్ న్యూస్: కరోనాపై పోరులో మరో ముందడుగు.. ట్రయల్స్ సక్సెస్!
Follow us on

Moderna’s Coronavirus Vaccine: కోవిద్-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనావైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ తయారీలో పురోగతి సాధ్యమైంది. అమెరికాకు చెందిన మోడెర్నా అనే బయోటెక్నాలజీ కంపెనీ ‘mRNA-1273’ పేరుతొ తయారు చేసిన వ్యాక్సిన్.. మొదటి దశలో మనుషుల మీద చేసిన ప్రయోగం విజయవంతమైంది.

వివరాల్లోకెళితే.. ‘‘ప్రయోగంలో భాగంగా, 8 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు రెండు డోసుల చొప్పున టీకా ఇచ్చాం. వారిలో కొన్ని రోజులకు కరోనాకు వ్యతిరేకంగా ఇమ్యూన్ సిస్టం యాక్టివేట్ అయి యాంటీబాడీలు తయారయ్యాయి. ఆ యాంటీబాడీలను ల్యాబ్ లో హ్యూమన్ సెల్స్ లో ఉంచి ప్రయోగం చేయగా, అవి కరోనా వైరస్ కణాలు రెప్లికేషన్ కాకుండా పూర్తిగా అడ్డుకున్నాయి. కరోనా వైరస్ సోకి, కోలుకున్న వ్యక్తుల్లోని యాంటీబాడీలతో ఇవి కూడా సరిగ్గా మ్యాచ్ అయ్యాయి.”అని మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టాల్ జాక్స్ వెల్లడించారు.

కాగా.. త్వరలో తాము సెకండ్ ఫేజ్ లో 600 మందిపై, వచ్చే జూలైలో థర్డ్ ఫేజ్ లో వేలాది మందిపై ట్రయల్స్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. నిజంగా ఇది మానవాళికి ఒక శుభవార్త.  మరికొద్ది రోజుల్లో కరోనా వ్యాక్సిన్ రాబోతోంది. ఇటు భారత్ లో కోవిద్-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజుతో లక్ష దాటింది.