Kamal Haasan : తమళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న కసి మీద ఉన్నారు. కోయంబత్తూరు నియోజకవర్గంలో వినూత్నరీతిలో ప్రచారం చేశారు కమల్‌హాసన్ . ఆటోలో తిరుగుతూ ప్రచారం చేశారు. నటుడు శరత్‌కుమార్ పార్టీతో జతకట్టారు కమల్. కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీ 154 స్థానాల్లో పోటీ చేస్తోంది.
ఇక ఆదివారం.. కమల్‌హాసన్ కారుపై ఓ యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో కమల్‌హాసన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రికి హోటల్‌లో బసచేసేందుకు ఆయన బయలుదేరుతుండగా అనుకోకుండా ఓ యువకుడు ఆయన కారుపై దాడికి యత్నించాడు. కమల్‌హాసన్ వ్యక్తిగత బౌన్సర్లు అడ్డుకున్నప్పటికీ ఆ యువకుడు వెనక్కితగ్గలేదు. వారిని నెట్టుకుంటూ కారు పైకెక్కి.. కమల్‌హాసన్ కూర్చున్న వైపు అద్దాన్ని పగులగొట్టేందుకు యత్నించాడు. అయితే, బుల్లెట్‌ప్రూఫ్ కావడంతో అద్దం దెబ్బతినలేదు. పార్టీ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే యువకుడు మద్యం మత్తులో ఉన్నట్టు గ్రహించిన పోలీసులు అతడిని విచారించి, హెచ్చరించి వదిలేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :