రంజాన్ మాసం ప్రారంభం కానున్నదని, ఈ మాసంలో ప్రజలు ఉదయం, రాత్రి వరకూ ప్రార్థనా మందిరాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కాల్పుల విరమణ పాటించాలని, సోదాలు, తనిఖీలు నిలిపివేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల జమ్ముకశ్మీర్ ప్రజలు ఒక నెల రోజులైనా ప్రశాంతంగా గడుపుతారని ఆమె ట్వీట్ చేశారు.
Request GoI to cease crackdowns, & search operations during Ramzan this year so that people arent subjected to harassment & can observe the holy month in peace.Last year’s ceasefire helped in providing a huge sense of relief. Hope electoral compulsions are put aside.
— Mehbooba Mufti (@MehboobaMufti) May 4, 2019