నటన నా రక్తంలోనే ఉంది.. త్వరలోనే సినిమాల్లో నటిస్తా.. : దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య

కన్నడ నటుడు చిరంజీవి సర్జా గుండె పోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో ఆకస్మిక మరణాన్ని ఆయన ఫ్యాన్స్ ఇనక జీర్ణించుకోలేక పోతున్నారు.

నటన నా రక్తంలోనే ఉంది.. త్వరలోనే సినిమాల్లో నటిస్తా.. : దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య

Updated on: Dec 15, 2020 | 7:11 PM

కన్నడ నటుడు చిరంజీవి సర్జా గుండె పోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో ఆకస్మిక మరణాన్ని ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. కేవలం 35 ఏళ్ల వయసులో గుండెపోటుతో చిరంజీవి మరణించడం.. చనిపోయే సమయానికి ఆయన భార్య మేఘన రాజ్ గర్భవతి కావడం అభిమానులను మరింత కలిచివేసింది. ఇటీవలే మేఘన రాజ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిరంజీవి మళ్ళీ పుట్టారంటూ ఆయన అభిమానులు సంబరపడ్డారు.

ఇదిలా ఉంటే మేఘన రాజ్ త్వరలో సినిమాల్లో నటిస్తానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నటనంటే నాకెంతో ఇష్టం. అది నా రక్తంలోనే ఉంది. నా భర్త చిరంజీవి సర్జా, నాకు ఇష్టమైనదేదీ వదులుకోవద్దని ఎప్పుడు నన్ను ప్రోత్సహించారు. త్వరలోనే నేను సినిమాల్లో నటిస్తా..నేను ఉన్నంతవరకు సినిమాల్లో యాక్ట్ చేస్తా అని ఆమె పేర్కొన్నారు. మేఘన తల్లిదండ్రులు సుందర్‌ రాజ్‌, ప్రమీల జోషాయ్‌ కన్నడ నటీనటులు. మేఘన రాజ్ బాలనటిగాను పలు సినిమాల్లో కనిపించరు. ఆమెకు బిడ్డ పుట్టిన దాగ్గరనుంచి సోషల్ మీడియా ద్వారా తన బిడ్డకు సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు మేఘన .

Loading...
Unable to load recommendations.
Follow Us