వరల్డ్ రికార్డ్.. 3 నెలల్లో 350 కోర్సులు పూర్తి..

సాధారణంగా లాక్‌డౌన్ అంటేనే అందరికీ హ్యాపీ మోడ్. అలాంటిది కేరళకు చెందిన ఓ యువతి మాత్రం ఒక్క క్షణం కూడా వృధా కాకుండా వినియోగించుకుంది.

వరల్డ్ రికార్డ్.. 3 నెలల్లో 350 కోర్సులు పూర్తి..

Updated on: Oct 03, 2020 | 1:19 PM

Kerala Women Completes 350 Online Courses: సాధారణంగా లాక్‌డౌన్ అంటేనే అందరికీ హ్యాపీ మోడ్. అలాంటిది కేరళకు చెందిన ఓ యువతి మాత్రం ఒక్క క్షణం కూడా వృధా కాకుండా వినియోగించుకుంది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత మార్చి 22న లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో జనాలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ నుంచి తప్పించుకోవాలంటే..ఇమ్యూనిటీ పెంచుకోవాలని తెలిసి అనేక రకాల వంటలు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ..టైమ్ పాస్ చేశారు. ఇక మరికొందరు పాత, కొత్త సినిమాలన్నింటినీ కూడా కవర్ చేశారు. అయితే కేరళకు చెందిన ఆరతీ రఘునాధ్ మాత్రం లాక్‌డౌన్‌లో ప్రపంచంలోని పలు యూనివర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ కోర్సులకు అడ్మిషన్లు తీసుకుని 90 రోజుల్లో 350 కోర్సులు కంప్లీట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించి చదువుల తల్లి అనిపించుకుంది.

కొచ్చిలోని ఎలమక్కర ప్రాంతానికి చెందిన ఆరతీ రఘునాధ్.. స్థానిక ఎం.ఈ.ఎస్ కాలేజీలో ఎంఎస్‌సీ బయో కెమిస్ట్రీ చదువుతోంది. కరోనా కట్టడికి దేశంలో విధించిన లాక్‌డౌన్ సమయాన్ని వినియోగించుకోవాలని భావించిన ఆమె.. ‘Coursera’ వెబ్‌సైట్‌ నుంచి ప్రపంచంలోని కొన్ని యూనివర్సిటీలు అందించే పలు ఆన్‌లైన్‌ కోర్సులకు అడ్మిషన్లు తీసుకుని వాటిని పూర్తి చేసింది. జాన్ హాకిన్స్ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ డెన్మార్క్ (డిటీయూ), వర్జీనియా విశ్వ విద్యాలయం, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ, కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం, రోచెస్టర్ యూనివర్సిటీ, ఎమోరీ విశ్వవిద్యాలయం, కోర్సెరా ప్రాజెక్ట్ నెట్‌వర్క్ అందించిన కోర్సులను ఆరతీ లాక్‌డౌన్ సమయంలో కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.

Also Read:

గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!