AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు!

Medak News: మెదక్ జిల్లా కూకట్లపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కప్పల కావడితో వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. "చినుకమ్మ ఓ చినుకమ్మ" పాటకు నృత్యం చేస్తూ రైతాంగం కోసం చేసిన వారి వినూత్న ప్రార్థన గ్రామస్తులను భావోద్వేగానికి గురిచేసింది.

Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు!
Medak News
P Shivteja
| Edited By: |

Updated on: Jul 22, 2026 | 8:30 PM

Share

భానుడి భగభగలకు భూమాత అల్లాడిపోతోంది. వర్షాలు లేక అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు పండాలని కోరుకుంటూ మెదక్ జిల్లాలో పాఠశాల విద్యార్థులు చేసిన వినూత్న ప్రార్థన అందరినీ ఆకట్టుకుంది. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకుంటూ చిన్నారులు చేసిన నృత్యం గ్రామస్తులను కదిలించింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల వేదికగా ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ విద్యార్థులు వరుణ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్రావు ఆధ్వర్యంలో చిన్నారులంతా ఏకమయ్యారు. గ్రామంలోని స్థానిక చెరువు నుంచి పవిత్ర జలాలను సేకరించారు. పురాతన సంప్రదాయం ప్రకారం కావలికి కప్పను, వేపాకులను, వేప రెమ్మలను కట్టి ప్రత్యేకంగా అలంకరించారు. ఆ కప్ప కావడిపై చెరువు నీటితో భక్తిశ్రద్ధలతో అభిషేకం చేస్తూ వాన దేవుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. చెరువు దగ్గర పూజలు ముగించుకున్న విద్యార్థులు.. నేరుగా వ్యవసాయ క్షేత్రాల్లోకి అడుగుపెట్టారు.

చినుకమ్మ ఓ చినుకమ్మ.. ఒక్కసారి వచ్చి నేల తడిసిపోవమ్మా అంటూ సాగిన పాటకు చిన్నారులు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. నిరీక్షిస్తున్న అన్నదాతల ఆవేదనను, వర్షం కోసం ఎదురుచూస్తున్న భూమాత తపనను తమ నృత్యం ద్వారా కళ్లకు కట్టారు. లోకకల్యాణం కోసం, రైతాంగం బాగుండాలంటూ పసి హృదయాలతో చిన్నారులు చేసిన ఈ ప్రార్థన చూసి గ్రామస్తులు ముగ్ధులయ్యారు. సాంప్రదాయాలను గుర్తుచేస్తూ.. సమాజ హితం కోరి విద్యార్థులు చేసిన ఈ ప్రయత్నాన్ని, వారికి మార్గదర్శిగా నిలిచిన హెచ్ఎం రామచందర్రావును గ్రామ పెద్దలు, ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. పసిపిల్లల పిలుపునైనా ఆలకించి వరుణుడు కరుణిస్తాడేమోనని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారుల ఆటాపాట వీడియో చూడండి..

Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది