ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం కష్టం. అనుకోకుండా క్షణకాలంలో జరిగే ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కొన్నిసార్లు పెద్ద ప్రమాదాల నుంచి అదృష్టవశాత్తూ బయటపడుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అందులో అయ్యో పాపం అనిపించేవి కొన్ని ఉండగా.. మరికొన్ని మాత్రం షాకింగ్‌గా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందులో ఊహించని ప్రమాదం నుంచి రెప్పపాటులో తన కూతురిని కాపాడుకున్నాడు ఓ తండ్రి.
ఆ వీడియోలో.. ఓ వ్యక్తి తన కూతురితోపాటు రోడ్డు పక్కనే స్కూటీపై కూర్చుని ఉన్నాడు. అయితే అనుకోకుండా పైకీ చూసిన అతను పైనుంచి శిధిలాలు పడడం గమనిస్తాడు. దీంతో వెంటనే కూతురిని తీసుకుని పక్కకు పరిగెత్తేలోపు పెద్ద శిధిలం కింద పడింది. దీంతో కూతురితోపాటు అతను పక్కనే ఉన్న షాపు ముందు బలంగా పడిపోయాడు. వెంటనే ఆ షాపులో ఉన్న వ్యక్తి వారిద్దరిని లేపి షాపులో కూర్చుపెట్టగా.. బయటి నుంచి మరికొందరు వచ్చి పాపను తీసుకుంటారు. అయితే ఒక్కసారిగా కిందపడడంతో ఆ వ్యక్తి వెన్నుమూకకు బలంగా గాయమైంది. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధురలో జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
जाको राखे साइयां मार सके न कोय
Visuals from Mathura, UP pic.twitter.com/0o9sneyPhg
— Piyush Rai (@Benarasiyaa) July 18, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.