టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

గత మ్యాచ్‌ల్లో ధనాధన్‌ ఆటతో ప్రత్యర్థులను చుక్కలు చూపించిన రెండు జట్లు ఇవాళ ఢీ అంటే ఢీ అంటున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మట్టికరిపించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఢీకొనబోతోంది. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.

  • Sanjay Kasula
  • Publish Date - 7:22 pm, Mon, 12 October 20
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

Bangalore Win The Toss : ఐపీఎల్‌-13లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్‌ల్లో ధనాధన్‌ ఆటతో ప్రత్యర్థులను చుక్కలు చూపించిన రెండు జట్లు ఇవాళ ఢీ అంటే ఢీ అంటున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మట్టికరిపించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఢీకొనబోతోంది. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో 2020 సీజన్ సగం పూర్తి కానున్న నేపథ్యంలో.. విజయంతో తొలి హాఫ్‌కు ముగింపు చెప్పాలని రెండు జట్లు చూస్తున్నాయి. రెండు జట్లు ఆరు మ్యాచులు ఆడి నాలుగు మ్యాచుల్లో విజయం సాధించాయి. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాప్‌ ఫామ్‌ను అందుకోవడం, బౌలర్లు కూడా నిలకడగా రాణిస్తుండటం బెంగళూరుకు కలిసొచ్చే అంశం.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో గెలుపొందిన కోల్‌కతా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆశలు వదులుకున్న స్థితిలో బౌలర్లు గొప్పగా పోరాడి జట్టుకు విజయాన్నందించారు.