మాన్సస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత మరో సంచలన నిర్ణయం, విజయనగరం కోటలో ఉన్న రెవిన్యూ కార్యాలయం తరలింపు

విజయనగరం మాన్సస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ విజయనగరం రాజాగారి కోటలో ఉన్న మాన్సస్...

మాన్సస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్  సంచయిత మరో సంచలన నిర్ణయం, విజయనగరం కోటలో ఉన్న రెవిన్యూ కార్యాలయం తరలింపు

Updated on: Dec 28, 2020 | 11:07 AM

విజయనగరం మాన్సస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ విజయనగరం రాజాగారి కోటలో ఉన్న మాన్సస్ రెవిన్యూ కార్యాలయంను విశాఖజిల్లాకు తరలిస్తూ మెమో విడుదల చేసింది మాన్సస్ యాజమాన్యం. పద్మనాభం మండలంలోని మూడున్నర ఎకరాలలో ఉన్న ఎమ్ ఆర్ వి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలకు తరలించేందుకు మోమో జారీ చేశారు. మాన్సస్ రెవిన్యూ కార్యాలయం తరలింపు నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. ఛైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ల సంతకాలతో కార్యాలయం మార్పు నిర్ణయం మోమో విడుదల చేసింది మాన్సస్.1958 లో పివిజి రాజు స్థాపించిన మాన్సస్ రెవెన్యూ కార్యాలయం అప్పటి నుండి కోటలోనే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కార్యాలయం మార్పుచేస్తూ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గుర్తిచేస్తుంది. ప్రస్తుతం మాన్సస్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.