‘మమతా బెనర్జీ పాపం ఒంటరివారవుతారు,’ ‘బెంగాల్ లో గణనీయమైన మార్పు రావలసిందే !; మెగా ర్యాలీలో అమిత్ షా గర్జన

| Edited By: Pardhasaradhi Peri

Dec 19, 2020 | 6:34 PM

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒంటరివారు కావడం ఖాయమని హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ఆమె పార్టీలో ఎవరూ మిపార్టీలోనూ, గలబోరన్నారు. శనివారం కోల్ కతా కు సుమారు 150 కి.మీ.దూరంలోని..

మమతా బెనర్జీ పాపం ఒంటరివారవుతారు,  బెంగాల్ లో  గణనీయమైన మార్పు రావలసిందే !; మెగా ర్యాలీలో అమిత్ షా గర్జన
Follow us on

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒంటరివారు కావడం ఖాయమని హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ఆమె పార్టీలో ఎవరూ మిపార్టీలోనూ, గలబోరన్నారు. శనివారం కోల్ కతా కు సుమారు 150 కి.మీ.దూరంలోని పశ్చిమ మెడినిపూర్ లో జరిగిన మెగా ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ఇక ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పని ఖతమన్నారు. ఈ పార్టీ నుంచి ఎందుకు ఇంతమంది రాజీనామా చేస్తున్నారు ? ఎందుకు ఇంతమంది వైదొలగుతున్నారు ? ఈ ప్రభుత్వ అపసవ్య పాలన వల్లే ! మమతా బెనర్జీ అవినీతి, బంధుప్రీతి వల్లే ! ఇది కేవలం నాంది మాత్రమే ! ఎన్నికల సమయం వచ్ఛేసరికి మమత ఒంటరిగా మిగిలిపోతారు..తృణమూల్ కాంగ్రెస్ ను వేళ్ళతో సహా గెంటివేసే తరుణం ఆసన్నమైంది అని అమిత్ షా ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.  ఈ రాష్ట్రంలో మార్పు రావాలని కోరుతున్నానని చెప్పారు. టీ ఎం సీ రాజ్యంలో గూండాలే పాలిస్తున్నారని, ఇందుకు ఇటీవల బీజేపీ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై జరిగిన దారుణమైన దాడే నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు.

కాగా తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత సువెందు అధికారి సహా వివిధ పార్టీల నుంచి 9 మంది ఎమ్మెల్యేలు, తృణమూల్ ఎంపీ సునీల్ మొండాల్ ..అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పార్టీలోనూ, ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని సువెందు అధికారి తెలిపారు. ఆ మేనల్లుడిని తొలగించండి అని ఆయన నినాదం చేశారు. అమిత్ షాతో తనకెంతో కాలంగా సాన్నిహిత్యం ఉందని, బీజేపీ తనను సోదరునిగా పరిగణిస్తోందని ఆయన చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ కోసం తన జీవితాన్ని ధారబోశానని, కానీ తనకు కోవిడ్ సోకినప్పుడు ఈ పార్టీ నుంచి ఎవరూ తనను పరామర్శించలేదని సువెందు అధికారి తెలిపారు. కానీ అమిత్ షా తనకు రెండు సార్లు ఫోన్ చేసి తన యోగక్షేమాల గురించి తెలుసుకున్నారని అన్నారు. అటు-అంతకుముందు ఈయనను, ఇతర రెబెల్స్ ను అమిత్ షా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  వీరి చేరికతో ఈ రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతమవుతుందన్నారు.