ఇకపై రెస్టారెంట్లు, పబ్బులు 24గంటలూ…

|

Jan 20, 2020 | 11:24 AM

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఇకపై 24 గంటలూ పబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు, మల్టీ‌ప్లెక్స్‌లు తెరిచి ఉంచాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం.. కంపెనీల పనితీరు ప్రోత్సహించడం.. ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా చేసిన ఈ ప్రతిపాదనను మహారాష్ట్ర టూరిజం మినిస్టర్ ఆదిత్య థాక్రే ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 26న పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. ముంబైలోని ఫోర్ట్‌కాలా, ఘెడా, బాంద్రా, కుర్లా ప్రాంతాల్లోని అన్ని మాల్స్, రెస్టారెంట్స్, […]

ఇకపై రెస్టారెంట్లు, పబ్బులు 24గంటలూ...
Follow us on

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఇకపై 24 గంటలూ పబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు, మల్టీ‌ప్లెక్స్‌లు తెరిచి ఉంచాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం.. కంపెనీల పనితీరు ప్రోత్సహించడం.. ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా చేసిన ఈ ప్రతిపాదనను మహారాష్ట్ర టూరిజం మినిస్టర్ ఆదిత్య థాక్రే ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటించారు.

ఇందులో భాగంగా ఈ నెల 26న పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. ముంబైలోని ఫోర్ట్‌కాలా, ఘెడా, బాంద్రా, కుర్లా ప్రాంతాల్లోని అన్ని మాల్స్, రెస్టారెంట్స్, మల్టీ‌ప్లెక్స్‌లు, పబ్బులను 24 గంటల పాటు తెరిచి ఉంచడానికి అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి కూడా అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జనావాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లోనే వాటిని 24 గంటలూ తెరిచి ఉంచేందుకు అనుమతిస్తున్నామని పోలీసులు తెలిపారు.