మహబూబ్ నగర్ జిల్లా కాంచన గుహలో వైభవంగా శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

పేదల తిరుపతిగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మపురం గ్రామం కాంచన గుహలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో ప్రారంభమై రెండు రోజులపాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార ఉత్సవం ఈరోజు సందడిగా జరిగింది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ SBI బ్యాంకు నందు భద్రపరిచిన ముక్కెర వంశీయులు బహుకరించిన కోట్ల విలువ చేసే స్వామివారి బంగారు ఆభరణాలకు భక్తి […]

  • Venkata Narayana
  • Publish Date - 2:58 pm, Fri, 20 November 20
మహబూబ్ నగర్ జిల్లా కాంచన గుహలో వైభవంగా శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

పేదల తిరుపతిగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మపురం గ్రామం కాంచన గుహలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో ప్రారంభమై రెండు రోజులపాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార ఉత్సవం ఈరోజు సందడిగా జరిగింది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ SBI బ్యాంకు నందు భద్రపరిచిన ముక్కెర వంశీయులు బహుకరించిన కోట్ల విలువ చేసే స్వామివారి బంగారు ఆభరణాలకు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించి SBI బ్యాంకు నుంచి భారీ పోలీస్ బందోబస్తులతో ఊరేగింపుగా తీసుకెళ్లి కాంచన గుహలో కొలువైన శ్రీ కురుమూర్తి స్వామి వారికి అలంకరించారు. ఈ ఉత్సవంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లతోపాటు ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. Covid నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అధికారులు భక్తులను తక్కువ సంఖ్యలో పాల్గొనాలని ముందుగానే సూచించడంతో ఈ ఉత్సవంలో భక్తుల సంఖ్య తక్కువగానే కనిపించింది.