పబ్‌జీ మోజుతో రూ.2 లక్షలు ఖర్చు చేసిన మరో కుర్రాడు..

పబ్‌జీ.. 2018లో రిలీజైన ఈ వీడియో గేమ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కుర్రకారుకు మంచి కిక్ ఇచ్చే ఈ గేమ్‌ను ఒకసారి ఆడితే చాలు.. దానికి అడిక్ట్ అయిపోతారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ కూడా ఈ పబ్జీకి బానిసలవుతున్నారు. కొంతమంది అయితే కుటుంబాన్ని, పరిసరాలను మర్చిపోయి మరీ ఈ ఆటలో లీనమైపోతున్నారు. తాజాగా ఈ పబ్జీ కోసం ఓ యువకుడు తన తండ్రి ఖాతాలో నుంచి రూ. 16 లక్షలు […]

పబ్‌జీ మోజుతో రూ.2 లక్షలు ఖర్చు చేసిన మరో కుర్రాడు..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 12:36 PM

పబ్‌జీ.. 2018లో రిలీజైన ఈ వీడియో గేమ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కుర్రకారుకు మంచి కిక్ ఇచ్చే ఈ గేమ్‌ను ఒకసారి ఆడితే చాలు.. దానికి అడిక్ట్ అయిపోతారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ కూడా ఈ పబ్జీకి బానిసలవుతున్నారు. కొంతమంది అయితే కుటుంబాన్ని, పరిసరాలను మర్చిపోయి మరీ ఈ ఆటలో లీనమైపోతున్నారు. తాజాగా ఈ పబ్జీ కోసం ఓ యువకుడు తన తండ్రి ఖాతాలో నుంచి రూ. 16 లక్షలు కాజేసిన ఘటన మరవకముందే.. మరో కుర్రాడు ఈ పబ్జీ కోసం రూ. 2 లక్షలు ఖర్చు చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. మొహలీకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు పబ్జీ గేమ్ మోజులో పడి.. యాప్‌ పర్చేజ్‌‌ల కోసం తన తాతయ్య పేటీఎం ఖాతా ద్వారా రూ. 2 లక్షలు ఖర్చు చేశాడు. జనవరిలో పబ్జీ గేమ్ ఆడటం మొదలుపెట్టిన ఆ కుర్రాడు క్రమంగా దానికి బానిసై.. తాత అకౌంట్ ద్వారా గత రెండు నెలల్లో సుమారు 30 లావాదేవీలు చేశాడు. అంతేకాకుండా ఈ గేమ్ కోసం ఎవరికీ తెలియకుండా ప్రత్యేకంగా సిమ్ కార్డును కూడా తీసుకున్నాడట.

తాజాగా బ్యాంక్ స్టేట్‌‌మెంట్ చూసుకున్నాక గానీ.. కుటుంబసభ్యులకు అసలు విషయం తెలియలేదు. తాత పెన్షన్ ఖాతా ద్వారా ఈ ట్రాన్సాక్షన్లు చేశాడని గుర్తించారు. ఈ కుర్రాడితో చదివే సీనియర్ ఒకరు ఇన్‌యాప్ పర్చేజ్‌‌లను తాత అకౌంట్ ద్వారా చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుసుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మొహాలీ ఎస్సెస్పీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సో తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండీ..! లాక్ డౌన్ లో ఇంటికి పరిమితమైన పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు