ఖమ్మంలో ఉద్రిక్తత .. కార్పోరేటర్ కారుకు నిప్పు

|

Sep 01, 2020 | 4:43 PM

ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఒకటో డివిజన్‌ కైకొండాయగూడెంలో  స్థానిక కార్పోరేటర్ పై  స్థానికులు దాడి చేశారు. అనంతరం అతని కారును తగలబెట్టారు.  ఆగస్టు 18న తేజ్‌ అనే యువకుడు అనుమానాస్పద..

ఖమ్మంలో ఉద్రిక్తత .. కార్పోరేటర్ కారుకు నిప్పు
Follow us on

ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఒకటో డివిజన్‌ కైకొండాయగూడెంలో  స్థానిక కార్పోరేటర్ పై  స్థానికులు దాడి చేశారు. అనంతరం అతని కారును తగలబెట్టారు.  ఆగస్టు 18న తేజ్‌ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడి మృతికి స్థానిక కార్పొరేటర్‌ రామ్మూర్తి నాయక్‌ కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు.

ఆందోళన జరుగుతున్న సమయంలో కార్పొరేటర్‌ కైకొండాయగూడెం రావడంతో బాధిత కుటుంబ సభ్యులు కార్పొరేటర్‌ వాహనాన్ని ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. దీంతో కార్పొరేటర్‌ అక్కడే ఉన్న పాఠశాలలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.

గొడవ జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రామ్మూర్తి నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా బంధువులు అడ్డుకుని నిప్పు పెట్టారు. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఏసీపీ వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితితులను చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.