ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..

| Edited By:

Aug 11, 2020 | 10:55 AM

మీకు ఎల్‌ఐసీ బీమా ఉందా..? కరోనా సంక్షోభం కారణంగా ప్రీమియం చెల్లించలేకపోయారా.? దీనితో మీ పాలసీ ల్యాప్ అయిపోయిందా.? అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా(ఎల్ఐసీ) మీకో గుడ్ న్యూస్ అందించింది.

ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..
Follow us on

LIC alert: మీకు ఎల్‌ఐసీ బీమా ఉందా..? కరోనా సంక్షోభం కారణంగా ప్రీమియం చెల్లించలేకపోయారా.? దీనితో మీ పాలసీ ల్యాప్స్ అయిపోయిందా.? అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా(ఎల్ఐసీ) మీకో గుడ్ న్యూస్ అందించింది. పాలసీదారులు తమ ల్యాప్స్‌డ్‌ పాలసీలను మళ్లీ రెగ్యులరైజ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ ఒక నూతన ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదేళ్లలో లోపు ల్యాప్స్ అయిన పాలసీలను కస్టమర్లు ఆగష్టు 10 నుంచి అక్టోబర్ 9 వరకు రెగ్యులరైజ్ చేసుకోవచ్చునని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అంతేకాకుండా పాలసీదారులు లేట్ ఫీజులో 20- 30 శాతం వరకు రాయితీ పొందవచ్చునని తెలిపింది. లక్ష వరకు ప్రీమియం చెల్లించాల్సిన వారికి ఆలస్య రుసుములో రూ. 20 శాతం.. అలాగే లక్ష నుంచి రూ. 3 లక్షల మధ్య 25 శాతం రాయితీ లభించనుంది. ఇక రూ. 3 లక్షలు ఆపైన ప్రీమియం కట్టాల్సిన వారికి ఆలస్య రుసుములో 30 శాతం రాయితీ పొందొచ్చు. కాగా, బీమా కవరేజ్‌ను పునరుద్దరించేందుకు పాత పాలసీని రెగ్యులరైజ్ చేయడం వల్ల పాలసీ ప్రయోజనాలు మళ్లీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

Also Read:

ఏపీ: ఆ మూడు లక్షణాలున్నా ఆసుపత్రిలో చేరొచ్చు..

రూ. 2000 వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపేసిన ఆర్బీఐ..